Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రాజెక్ట్ K' రిలీజ్ ఎప్పుడంటే .. !

Projekt K Movie Update
  • రిలీజ్ కి రెడీగా 'రాధేశ్యామ్'
  • షూటింగు పూర్తి చేసుకున్న 'ఆది పురుష్'
  • ముగింపు దశలో 'సలార్'
  • తదుపరి షెడ్యూల్ ఆలోచనలో 'ప్రాజెక్టు K'  
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను ఒప్పేసుకుంటుంటే, ఇవన్నీ ఎప్పుడు పూర్తికావాలి అని చాలామంది అనుకున్నారు. కానీ ప్రభాస్ చాలా ఫాస్టుగా 'ఆది పురుష్' సినిమాను అవ్వగొట్టేశాడు. 'సలార్' ను కూడా ముగింపు దశకి తీసుకుని వచ్చేశాడు. అంతేకాదు .. 'ప్రాజెక్టు K' సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేశాడు.

ఇక ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ సినిమా షూటింగు .. విడుదల మరింత ఆలస్యం కానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ .. "ఈ సినిమా షూటింగు మరింత ఆలస్యం కానుందనే ప్రచారంలో నిజం లేదు. పరిస్థితులు చూసుకుని ఈ నెల చివరిలో మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాము.

ఈ షెడ్యూల్లో అమితాబ్ .. దీపిక కూడా పాల్గొననున్నారు. సాధ్యమైనంత వరకూ వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే అనుకుంటున్నాము. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటున్నాము" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తరువాత, సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రభాస్ 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
Prabhas
Nag Ashwin
Project K Movie

More Telugu News